ఆ జిల్లా వైసీపీ ఎందుకు సైలెంట్ అయింది అంటారూ…?
నెల్లూరు జిల్లా నేతలు ముందు నుంచి కూడా కాస్త ఆసక్తి కరంగానే ఉంటారు. వాళ్ళు ఏది మాట్లాడినా సరే రాజకీయవర్గాల్లో ముందు నుంచి కూడా హైలెట్ అవుతూనే ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా అధికార వైసీపీ లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా నేతలు పెద్దగా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. దీని వెనుక అసలు ప్రధాన కారణం ఏంటి అనేది అర్థం కాకపోయినా జిల్లా నేతలలో ఎక్కడైనా అసంతృప్తి ఉందా అంటూ వైసిపి వర్గాలు ఆరా తీస్తున్నా సరే అసలు విషయం ఎక్కడా కూడా బయటకు రావడం లేదు.
వైసిపి అనుకూల మీడియా కూడా వారి గురించి పెద్దగా కథనాలు రాయడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జిల్లాల నేతలు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తున్నా సరే జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు సీనియర్ ఎమ్మెల్యేలు గానీ ఎక్కడా కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. 2019 ఎన్నికల తర్వాత మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బాగా హైలెట్ అయ్యారు. అలాగే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా జిల్లాలో సంచలనంగా మారారు. అయినా సరే ఇప్పుడు ఎవరు కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు.
దీని వెనుక అసలు కారణం ఏంటి అనేది కూడా అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి జగన్ తీరుపై కొంతమంది ఎమ్మెల్యేలు అసహనంగా ఉన్నారని భారతీయ జనతా పార్టీ లో చేరడానికి ఒక మాజీ ఎంపీ గారి నివాసంలో చర్చలు కూడా జరిపారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నెల్లూరు వెళ్లి అక్కడి నేతలతో మాట్లాడి వారి మధ్య విభేదాలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా పెద్దగా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. దీంతో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కావడం లేదు.
నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలో వైసిపి బలంగా ఉంది. ఇక్కడ ఏకగ్రీవాలు ఎక్కువగా జరగాల్సి ఉన్నా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. దీని వెనుక అసలు కారణం ఏంటో అర్థం కావడం లేదు. రెడ్డి సామాజిక వర్గానికి మరో సామాజిక వర్గానికి మధ్య జిల్లాలో విభేదాలు ఉన్నాయనే కథనాలు కూడా వస్తున్నాయి. దీనితో ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు నెల్లూరు జిల్లా నేతలను పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని కూడా అంటున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అధికారుల తీరు విషయంలో నెల్లూరు జిల్లా నేతలు ముందు నుంచి కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు.













