నెల్లూరు లో ఈ సారి ఆ రికార్డులు ఎవరు సాధిస్తారో?
ఎన్నికల్లో ప్రత్యర్థులపై మెజారిటీతో గెలవడం సర్వసాధారణం .అయితే ఇందులో కూడా అత్యధికం అత్యల్పం అన్న లెక్కలు ఉంటాయి అని మీకు తెలుసా? 2019 ఎన్నికల్లో సూళ్లూరుపేట ఎమ్మెల్యే అయిన సంజీవయ్య అందరి కంటే ఎక్కువ మెజారిటీ అప్పట్లో టిడిపి అభ్యర్థిగా పరసా వెంకటరత్నం ఇతనిపై పోటీ చేశాడు. అయితే పరసాకు 58,335 ఓట్లు రాగా సంజీవయ్య 1,19,627 ఓట్లు సాధించి..61,292 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పట్లో ప్రత్యర్థి పై ఎక్కువ మెజారిటీ ఓట్లు సంపాదించింది ఇతనే. అదే సంవత్సరం జరిగిన ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్, నారాయణ పై కేవలం 1,988 ఓట్ల తేడాతో గెలిచాడు. ప్రత్యర్థి పై అతి స్వల్పమైన మెజారిటీ అనిల్ సాధించాడు. అయితే రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ అత్యల్ప మెజారిటీ ఏ నాయకుడు సాధిస్తాడో చూడాలి. నెల్లూరులో 2019 ఎన్నికల రికార్డులను ఈసారి ఏ పార్టీ బ్రేక్ చేస్తుంది అన్న విషయంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.













