ప్రైవేటీకరణ దిశగా ప్రయాణిస్తున్న వేళ… సత్తా చాటిన విశాఖ స్టీల్ ప్లాంట్
విశాఖ స్టీల్స్‌ను దమ్మును నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగులు. కేంద్రం విశాఖ స్టీల్స్‌ను ప్రైవేట్‌పరం చేసే ప్రాసెస్‌లో ఉన్న సమయంలో విశాఖ స్టీల్స్ తన సత్తాను చాటింది. కర్మాగారం చరిత్రలోనే రెండో విజయాన్ని సాధించి, మరో రికార్డును నెలకొల్పింది. వైజాగ్ స్టీల్స్ టర్నోవర్ 18 వేల కోట్ల రూపాయలను సాధించామని విశాఖ స్టీల్స్ ఎంపీ పీకే రథ్ వెల్లడించారు. ఈ కంపెనీ చరిత్రలోనే రెండో అత్యధిక విజయమని ఆయన తెలిపారు. గత ఆర్థిక ఏడాదిలో కర్మాగారం 13 శాతం వృద్ధి నమోదు చేసుకుందని, ఈ నాలుగు నెలల్లోనే 740 కోట్ల రూపాయల మేర నికర లాభం సాధిమచామని ఆయన తెలిపారు. మార్చి మాసంలో 7,11,000 టన్నుల ఉక్కును 3,300 కోట్లకు విక్రయించినట్లు వెల్లడించారు. విశాఖ స్టీల్స్‌ను ప్రైవేటీకరించే ప్రాసెస్‌లో ఉన్న సమయంలో ఈ రికార్డు నెలకొల్పడం గమనించదగ్గ పరిణామం.













