Governance Services :ఏపీలో వాట్సప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం
దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సప్ గవర్నెన్స్ (WhatsApp Governance )కు శ్రీకారం చుట్టింది. జవనరి (, January) 30 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాట్సన్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) సమీక్ష నిర్వహించారు. మొదటి దఫాలో 161 సేవలు పౌరులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అధికారిక వాట్సప్ నంబర్‌ను ప్రకటించనుంది. ఆ ఎకౌంట్‌కు వెరిఫైడ్ ట్యాగ్ (టిక్ మార్క్) ఉంటుంది. ఈ నంబరు వన్‌స్టాప్ సెంటర్లా పనిచేస్తుంది. తొలిదశలో ఇందులో 161 రకాల సేవలు అందించనున్నారు. భవిష్యత్తులో వీటిని మరింత విస్తృతం చేయనున్నారు.













