టీడీపీకి కుప్పం కంచుకోట : చంద్రబాబు
తెలుగుదేశానికి కుప్పం నియోజకవర్గం కంచుకోట అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ కుప్పం ప్రాంతానికి ఏం చేశారని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, టీడీపీ అధికారంలో ఉంటే హంద్రీనీవా ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేవాళ్లం. హంద్రీనీవాను పూర్తి చేయడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డాం. మేము 87 శాతం పనులు పూర్తి చేస్తే, 13 శాతం పూర్తి చేయని దద్దమ్మ ప్రభుత్వమిది. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదు. దోపిడీ గజ దొంగలు రాష్ట్రానికి దోచుకోవడానికే అధికారంలోకి వచ్చారు. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదు. రైతులను ప్రోత్సహించేందుకు ఏ కార్యక్రమమైనా చేపట్టారా అని ప్రశ్నించారు.













