ఏపీ పోలీసులకు శుభవార్త
పోలీసులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపటి నుంచి పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. కానిస్టేబుల్ నంచి సీఐ వరకు వారంలో ఒకరోజు వీక్లీ ఆఫ్ లభించనుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన తొలి కేబినెట్ మీటింగ్‌లోనే పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వడంపై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. వారంతపు సెలవు ఇవ్వడంలో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అన్నీ పరిశీలించిన తర్వాత తాజాగా పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. ప్రభుత్వ నిర్ణయంపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.













