ఎక్కడా జరగని అభివృద్ది మనం చేశాం: CM
ఎక్కడా లేని సంక్షేమం మనం చేశాం
అన్నివర్గాల ప్రజలంతా మనవెంటే, టిడిపితోనే
మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలవాలి.
మీ మాట చెల్లుబాటు కావాలి.
అభివృద్దిలో మీరంతా భాగస్వాములు కావాలి.
మీ చేతులమీదుగా పేదల సంక్షేమం జరగాలి.
భవిష్యత్తులో శాశ్వతంగా ఈ గౌరవం మీకు ఉంటుంది
కష్టపడిన వాళ్లందరికీ గుర్తింపు ఇస్తాను.
టెక్నాలజికి మనం మాస్టర్ కావాలి. అంతే తప్ప టెక్నాలజికి మనం సర్వెంట్ కారాదు.
ఈవిఎంల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వీవి ప్యాట్ రశీదులు 50%పైగా ఇవ్వాలని అడిగాం. దానిపై ఎన్నికల సంఘంతో మాట్లాడుతున్నాం. ప్రతి బూత్ లో ఓటింగ్ పై అప్రమత్తం. ప్రతి ఈవిఎంలో కౌంటింగ్ పై అప్రమత్తం.
పించన్ పొందే ప్రతి కుటుంబం నన్ను పెద్ద కొడుకుగా భావించాలి
రుణమాఫీ పొందిన ప్రతి రైతు కుటుంబం నన్నో రైతుబిడ్డగా భావించాలి
పసుపు-కుంకుమ పొందిన ప్రతి ఆడబిడ్డ నన్నో పెద్దన్నగా భావించాలి
ఫీజులు పొందే ప్రతి విద్యార్ధికి నేనో గార్డియన్ ను.
ఉపాధి పొందిన యువతరం నన్నో పెద్దన్నగా భావించాలి
వర్షాకాలానికల్లా వెలిగొండ పూర్తి చేస్తా
శ్రీశైలం నీళ్లు తొలుత పారేది వెలిగొండ టన్నెల్ లోనే
సాగర్ టెయిలెండ్ భూములకు సాగునీళ్లిస్తా
ప్రకాశం జిల్లా భూములు సారవంతమైనవి
ఇక్కడి రైతులు నిరంతరం కష్టజీవులు
ఇప్పటికే మీ భూముల ధరలు పెరిగాయి
వెలిగొండ పూర్తయితే భూముల ధర మరింత పైకి
గ్రావిటితో నీరిస్తాం, లిఫ్ట్ లు పెట్టి నీళ్లిస్తాం
ప్రతి ఎకరానికి నీళ్లు మీకు గిఫ్ట్ గా ఇస్తాను
ప్రతి నియోజకవర్గాన్ని నాకు గిఫ్ట్ గా ఇవ్వండి
ప్రతిఒక్కరూ పోలవరం ప్రాజెక్టు చూడాలి.
ప్రతిఒక్కరూ రాజధాని పనులు చూడాలి.
ప్రతి ఒక్కరూ ‘మహా నాయకుడు’ సిన్మా చూడాలి
ఈ మూడూ చూస్తే స్ఫూర్తి పొందనివాళ్లు ఉండరు.













