Sribharat : విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు త్వరలోనే: ఎంపీ శ్రీభరత్
వైసీపీ హయాంలో భ్రష్టుపట్టిన వ్యవస్థలను తిరిగి గాడిన పెడుతున్నామని విశాఖ ఎంపీ శ్రీభరత్ (Sribharat) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ (Visakhapatnam Railway Zone) ఏర్పాటుకు త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ (Gazette notification) వస్తుందన్నారు. విశాఖలో చేయాల్సిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. ఫ్లైఓవర్ (Flyover), మెట్రో (Metro) నిర్మాణానికి సుమారు రూ.15 వేల కోట్లు అవసరమవుతాయని, కేంద్రం సహకారం అందిస్తే పనులు మొదలుపెడతామని అన్నారు.













