సీఎం జగన్ ను సత్కరించిన ఏపీజీఎఫ్ సంఘం నాయకులు
వీఆర్ఏ సంఘం నాయకులు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో కలిశారు. రద్దయిన డీఏను పెంచి మరి అందిస్తుండడంపై వాళ్లు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం గతంలో వీఆర్ఏలకు ఇస్తున్న రూ.300 డీఏను రద్దు చేసింది. అయితే ఈ విషయంపై సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. దానిని కొనసాగించాలంటూ ఏపీజీఎఫ్ ప్రతినిధులు ఆయనకు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రూ.300 కు బదులుగా డీఏని రూ.500కు పెంచి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీజీఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వీఆర్ఏ సంఘ నాయకులు ధైర్యం, సత్యరాజ్, సుధాకర్, వెంకటేశ్వర్ల బృందం సీఎం జగన్ను సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు.













