తిరుమలలో ఉపరాష్ట్రపతి వెంకయ్య
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి విశ్రాంతి గృహాల వద్ద ఆయనకు టీటీడీ ఈవో కె.ఎస్ జవహర్ రెడ్డి, కలెక్టర్ ఎం.హరిరానాయణన్, సీవీఎస్వో గోపినాథ్‌జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఇతర అధికారులు సాదర స్వాగతం పలికారు. రిసెప్షన్ అధికారులు బస ఏర్పాటు చేశారు. రాత్రికి ఉపరాష్ట్రపతి తిరుమలలోనే బస చేసి గురువారం శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత పుష్పగిరి మఠంలో జరగనున్న తన మనవరాలి వివాహానికి హాజరవుతారు. అనంతరం తిరుమల నుంచి రోడ్డుమార్గాన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వెళ్లారు.













