మార్చి 25 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మూెత్సవాలు
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని కడప జిల్లా ఒంటిమిట్టలో వెలసిన శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మూెత్సవాలు మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు అంగరంగవైభవంగా నిర్వహించనున్నట్లు టిటిడి ఇవో అనిల్కుమార్సింఘాల్ ప్రకటించారు. శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని స్వామివారి వార్షిక బ్రహ్మూెత్సవాలను వైభవంగా జరుపుతామన్నారు. మార్చి 25వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు ధ్వజావరోహణంతో ఆరంభమయ్యే వార్షిక బ్రహ్మూెత్సవాలు ఆదేరోజు శ్రీరామజయంతి, పోతనజయంతి ఉత్సవాలతో పాటు రాత్రికి శేషవాహనం జరుగుతుందన్నారు. మార్చి 31వ తేదీ స్వామివారి రథోత్సవం, ఏప్రిల్ 2వ తేదీ ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం కార్యక్రమం వుంటుందన్నారు. ఏప్రిల్ 3 మంగళవారం రాత్రికి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ అన్నమాచార్య కళా ప్రాజెక్టు, ధర్మప్రచారపరిషత్ ఆధ్వర్యంలో సాంస్క్కతిక కార్యక్రమాలు, హరికథలు వుంటాయన్నారు.













