మేజర్ పోర్టుల్లో మేటి విశాఖ
దేశంలోని మేజర్ పోర్టుల్లో విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ టాప్ త్రీలో ఒకటిగా నిలిచింది. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో విశాఖ పోర్టు ‘గుడ్’ కేటగిరిలో నిలిచింది. విశాఖపోర్టుతో పాటు జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్, కామరాజు పోర్టు కూడా ‘గుడ్’ కేటగిరిల్లో నిలిచాయి. కార్గో హ్యాండ్లింగ్, వినియోగదారుల సంతృప్తి తదితర అంశాలపై అధికారులు, వాణిజ్య సంస్థలు, పోర్టుకు సరకు రవాణా చేసే వివిధ సంస్థలకు చెందిన సుమారు 700 మంది నుంచి బ్రాడ్‌స్ట్రీట్ సంస్థ ఫీడ్‌బ్యాక్ తీసుకుంది. ఈ సందర్భంగా పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు మాట్లాడుతూ పోర్టు ఉత్తమ స్థానంలో నిలవడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేశారు.













