విశాఖ విమానాశ్రయంలోనూ విదేశీయులు వీసా తీసుకోవచ్చు
విదేశీయులు ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటే ఇక మీదట వీసా ముందే తీసుకుని రావాల్సిన అవసరం ఉండదు. వీసా ఆన్ అరైవల్ కోసం ఆన్లైన్లో ముందుగా దరఖాస్తు చేసుకుని వచ్చేయవచ్చు. విశాఖపట్నం విమానాశ్రయంలో దిగాక అక్కడికక్కడే వీసా పొందవచ్చు. ఇందుకు వీలుకల్పిస్తూ, విశాఖపట్నంలో వీసా ఆన్ అరైవల్ జారీ చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ అనుమతిచ్చింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి సమాచారమందింది. ఇది వెంటనే అమల్లోకిస్తుందని, సంబంధిత అధికారులు తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సృష్టం చేసింది. కేంద్రం తాజా నిర్ణయంతో రాష్ట్రానికి విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.













