ఆ రోజు వస్తానని సీబీఐకి తెలిపిన ఎంపీ అవినాష్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అనుమానితుల విచారణ ప్రక్రియలో దోబూచులాటకు తెరపడింది. ఇప్పటివరకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరెడ్డికి సీబీఐ నోటీసులివ్వడం, విచారణ విషయంలో ఒక రోజు ముందుకు, రెండు రోజులు వెనక్కి అన్నట్లుగా కొనసాగుతూ వచ్చింది. సోమవారం విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసినా, ఆ రోజున హాజరు కావడం కుదరదని ఎంపీ తెలిపారు. దీంతో సీబీఐ అదివారం రాత్రి మరోసారి వారికి నోటీసులు జారీ చేసింది. అవినాష్ రెడ్డిని ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ సీబీఐ కార్యాయలానికి రావాలని పేర్కొంది. అలాగేని ఆయన సమాధానమిచ్చారు. భాస్కరరెడ్డిని ఈ నెల 12వ తేదీన కడపలో విచారణకు హాజరుకావాలని సీబీఐ కోరింది. ఈ మేరకు ఆయన కూడా రోజు విచారణకు హాజరవుతారని ఎంపీ వెల్లడించారు.













