మంత్రి పెద్దిరెడ్డికి పుంగనూరును సీఎం జగన్ రాసిచ్చారా?
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పుంగనూరును సీఎం జగన్ రాసిచ్చారా? అని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పుంగనూరు ఘటన ఉత్తరాంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిందని అన్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం జగన్ విశాఖ వస్తాననేది కేవలం ఉత్తరాంధ్ర వాసులను అణగదొక్కేందుకేనా అని ప్రశ్నించారు. జగన్ వచ్చాక ఎందరిపై రౌడీషీట్ ఎత్తేశారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.













