కరోనా నివారణకే మహాయాగం : స్వరూపానందేంద్ర
విశాఖ శారదాపీఠం 11రోజుల పాటు నిర్వహించిన విషజ్వర పీడాహరయాగం శనివారం నాటితో ముగిసింది. ఈనెల 18న పీఠం యాగశాలలో ప్రారంభమైన ఈ యాగం 11 రోజుల పాటు కొనసాగింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతుల పర్యవేక్షణలో అనేక మంది రుత్విక్లు, వేద పండితులు ఈ యాగంలో పాల్గొన్నారు. శనివారం ఉదయం వేద మహా పండితుల సమక్షంలో మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఋత్విక్లు, వేదపండితులు దన్వంతరి జపం ఆచరించారు. అపమ •త్యుదోషనివారణతో కూడిన మంత్రాలను జపించారు. అదర్వణవేదంలో ఉన్న మంత్రాలుతో పాటు ఉత్కష్టమైన యోగవాశిష్ట గ్రంథంలో సూచించిన బీజాక్షరాలు సంపుటిని యాగంలో ప్రయోగించారు. దీంతో పాటు మహా సౌరసహిత పారాయణం నిర్వహించారు. వనమూలికలు, సుగందద్రవ్యాలు, మేడివ •క్షానికి చెందిన సమిధలను యాగానికి వినియోగించారు. మానవాళి ఆయురారోగ్యం కోసమే విషజ్వరపీడా హరయాగం చేపట్టామని పీఠాదిపతి స్వరూపానందేంద్రసరస్వతి చెప్పారు. మహాపూర్ణాహుతి సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టే నివారణోపాయం తెలియక ప్రపంచమంతా సతమతమవుతున్న తరుణంలో విశాఖ శారదాపీఠం ఈ విషజ్వర పీడాహరయాగాన్ని చేపట్టిందన్నారు. 11 రోజుల పాటు సాగిన యాగం విజయవంతంగా ముగిసిందన్నారు.













