విశాఖ శారద పీఠంలో మహాకుంభాభిషేకం
విశాఖలోని శ్రీశారదా పీఠంలో ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకూ అష్టబంధన మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి తెలిపారు. పీఠం ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో స్వామీజీ మాట్లాడారు. శారదాపీఠంలో నిర్మించిన నూతన దేవాలయం చుట్టూ ద్వాదశ సరస్వతులు, అంతరాలయంలో శారదామాత విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అష్టబంధన మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు వివరించారు. 14న జరిగే మహాపూర్ణాహుతి కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ప్రముఖులు హాజరవుతారని స్వామీజీ వివరించారు.













