జగన్ రేంజ్ లో సో.. సో అంటే అంతే మరి..
రీసెంట్ గా జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి బుట్టా రేణుకను పరిచయం చేశారు. అయితే ఆమె గురించి మాట్లాడుతూ జగన్.. ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రమే ఉన్న వ్యక్తి.. సమాజానికి ఎంతో మంచి చేస్తారు కాబట్టి మీరు తప్పక గెలిపించాలి అని అన్నారు. ఇప్పుడు ఈ విషయంపై సోషల్ మీడియాలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే నిజానికి బుట్టా రేణుక ఆంధ్ర రాజకీయ నాయకులలో ఉన్న బిగ్ షాట్స్ లో ఒకరు. 2014 సబ్మిట్ చేసిన ఎన్నికల అఫిడవిట్లో ఆమె తన ఆస్తుల విలువ 242 కోట్లగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో బుట్టా రేణుక, ఆమె భర్త ఓ ఇంటర్వ్యూలో తమ వ్యాపారాల గురించి చెప్పిన వీడియో క్లిప్ వైరల్ అవుతుంది. స్కూల్స్ దగ్గర నుంచి కన్వెన్షన్ సెంటర్స్ వరకు.. ఆటోమొబైల్ డీలర్ షిప్ నుంచి యాత్రి నివాస్ వరకు.. వారు ఉన్న రంగాల గురించి వివరించి చెప్పిన వీడియో అది. దీంతో 1000 కోట్ల ఆస్తులు ఉన్న వ్యక్తిని అలా జగన్ సో సో అని వర్ణించడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంతేకాకుండా రీసెంట్ గా బుట్టా హాస్పిటాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బుట్టా దంపతులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు కోట్ల రూపాయల విరాళాన్ని అందించారట. అలాంటి వ్యక్తులను సో సో ఆస్తులు ఉన్నవారు అనడం విడ్డూరమే కదా.













