టీటీడీ కీలక నిర్ణయం .. ఐదు రోజుల పాటు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో రేపటి నుంచి ఐదు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనానికీ టీటీడీ అనుమతి ఇచ్చింది. అలిపిరి నుంచి దర్శన టోకెన్లు లేకపోయినా తిరుమలకు అనుమతి ఇచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లలోకి రెండేళ్ల తర్వాత భక్తులను టీటీడీ అనుమతించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. విపరీతమైన రద్దీ కారణంగా తిరుమలకు వచ్చే భక్తులకు దర్శనం జాప్యం అయ్యే అవకాశం ఉందని టీటీడీ తెలిపింది. భక్తులు సంసిద్ధతతో తిరుమలకు రావాల్సిందిగా కోరింది.













