ఏపీకి కేంద్రం మొండి చేయి : విజయసాయి
కేంద్ర బడ్జెట్ తమకు నిరాశ కలిగించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. వ్యవసాయంపై ఆధారపడి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ నిరూపయోగమని ఆయన పెదవి విరిచారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదు. బడ్జెట్లో కొన్ని అనుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయి. డిపాజిటర్ల భీమ లక్ష నుంచి 5 లక్షలకు పెంచడం మంచి పరిణామం. వ్వయసాయ కేటాయింపుల్లో ఏపీకి రావాల్సిన వాటాను కచ్చితంగా ఇవ్వాలని. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు త్వరితగతిని నిధులు కేటాయించాలి. అలాగే రాష్ట్రానికి, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలి. నిధుల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం మొండి చేయి చూపించింది. పక్షపాత ధోరణితో రాష్ట్రాన్ని వివక్షతతో చూడటం మంచిది కాదన్నారు.
ఏపీలో వెనుబడిన జిల్లాలకు నిధుల కేటాయింపులు లేవు. ఏపీకి ఒక్క రైల్వే ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదు. ప్రత్యేక హోదాతో పాటు కీలక అంశాలను ప్రస్తావించలేదు. ఆన్లైన్ విద్య పై జీఎస్టీ 18 శాతం చాలా ఎక్కువ. మౌలిక వసతులకు బడ్జెట్ ఎలా సమకూరుస్తారనే దానిపై వివరణ ఇవ్వాలి. ఏపీకి ఒక కొత్త రైలు ప్రాజెక్టు కూడా ఇచ్చినట్లు మాకు సమాచారం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్‌పోర్టులను అభివృద్ధికి సరిపడ నిధులు ఇవ్వాలి అని అన్నారు.













