Vijayasai Reddy: జగన్ కు అన్నీ తెలుసన్న విజయసాయి
వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేసినట్టు తెలిపారు వైసీపీ తాజా మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy). రాజీనామా ఆమోదం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర కామెంట్స్ చేసారు. నా రాజీనామాను ధన్‌ఖడ్ ఆమోదించారని తెలిపారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానన్న ఆయన లండన్‌లో ఉన్న జగన్ (Ys Jagan) తో ఫోన్లో మట్లాడా.. అన్నీ వివరించాను అన్నారు. జగన్‌తో మాట్లాడిన తర్వాతే రాజీనామా చేశాను అన్నారు. ఒకసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాలు మాట్లాడకూడదన్నారు.
భవిష్యత్తులో రాజకీయాలపై మాట్లాడనని స్పష్టం చేసారు. పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేస్తాను అన్నారు. తాను నేను ఏ రోజూ అబద్దాలు చెప్పలేదని వెంకటేశ్వరస్వామిని నమ్ముకున్న వ్యక్తిగా నేను అబద్దాలు చెప్పననన్నారు. మూడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. వైఎస్ కుటుంబంతో విభేదాలు లేవన్నారు. అప్రూవర్‌గా మారాలని ఒత్తిడి వచ్చినా మారలేదని వెన్నుపోటు రాజకీయాలు నాకు తెలియవన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ సీపోర్ట్ కేసు పెట్టారని పేర్కొన్నారు.
తనపై లుకౌట్ నోటీసు ఇచ్చారన్నారు. నన్ను ఏ2గా చేర్చారన్న ఆయన.. కేవీ రావుతో నాకు ఎలాంటి సన్నిహిత సంబంధాలు, వ్యాపార లావాదేవీలు లేవని స్పష్టం చేసారు. విక్రాంత్‌రెడ్డితో నాకున్న పరిచయం చాలా తక్కువన్నారు. నా పిల్లలపై ప్రమాణం చేసి చెబుతా.. కాకినాడ సీపోర్టు వ్యవహారం గురించి నాకు తెలియదు అన్నారు. నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు.. 24 గంటలూ పార్టీ కోసమే పనిచేశా అని స్పష్టం చేసారు. కాకినాడ సీపోర్టు అంశానికి.. నాకు సంబంధం లేదన్నారు. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు.. ఇది పూర్తిగా వ్యక్తిగతం అని క్లారిటీ ఇచ్చారు.
నా రాజీనామాతో కూటమికే లబ్ధి వైసీపీకి నష్టం అన్నారు. ఎలాంటి పదవులు ఆశించి నేను రాజీనామా చేయలేదు అని తెలిపారు. కేసులు మాఫీ చేస్తారనీ రాజీనామా చేయలేదు అన్నారు. ఎటువంటి కేసునైనా ధైర్యంగా ఎదుర్కొంటాను అన్నారు. నేను ఎవరికీ భయపడను.. నా ఒంట్లో భయమనేతత్వం లేదని గవర్నర్ పదవి కానీ.. బీజేపీలో చేరడంలాంటిది కానీ ఏమీలేదని తెలిపారు. విజయసాయిరెడ్డి విశాఖను దోచేశారనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. నా కుమార్తె, అల్లుడికి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని… వారి ఆస్తులు నాకు ఆపాదిస్తే నేను చేసేదేమీ లేదని నాకు ఉన్నది బెంగళూరులో ఒక ఇల్లు, విజయవాడలో ఒకటి, విశాఖలో ఒక అపార్ట్ మెంట్ అని స్పష్టం చేసారు.













