కేంద్ర బడ్జెట్లో .. ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది శూన్యం
ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది శూన్యమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ ఏపీ విషయంలో ఈ బడ్జెట్ అత్యంత చెత్త బడ్జెట్‌గా అభివర్ణించారు. పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన సంస్థలు, నిధులను ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపుతోందని వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశ పరిచిందని అన్నారు. ఆత్మ నిర్భరత కేంద్రానికే కాదు రాష్ట్రాలకూ అవసరమేనని తెలిపారు. సెస్‌లు, సర్ఛార్జ్ల పేరుతో రాష్ట్రాల పన్ను వాటా తగ్గించారని తెలిపారు. పెట్రోల్ విషయంలో ట్యాక్స్ వాటా 40 శాతం తగ్గిందని తెలిపారు. విద్య కోసం ఏపీ 11.8 శాతం ఖర్చు చేస్తుంటే కేంద్రం 2.6 శాతం ఖర్చు చేస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ కేంద్రం కంటే రాష్ట్రామే ఎక్కువ ఖర్చు చేస్తోందని తెలిపారు. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని అన్నారు.













