వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డి
వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. లోక్‌సభలో వైకాపా పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, విప్‌గా మార్గాని భారత్‌ను నియమించారు. ఈ ముగ్గురిని ఆయా పదవుల్లో నియమిస్తున్నట్లు వైకాపా అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రికి లేఖ రాశారు. విజయసాయిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. మిథున్‌రెడ్డి వరుసగా రెండో సారి లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. వైకాపాలో కీలకనేత ఉన్న విజయసాయిరెడ్డిని రాష్ట్రమంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ, చివరకు ఆయన్ను పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించారు.













