ఈ విషయాన్ని అన్ని పార్టీలూ గుర్తుంచుకోవాలి : ఉపరాష్ట్రపతి
రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు బాధ్యతాయుతంగా, ఆచరణ సాధ్యమైనవే ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ విషయాన్ని అన్ని పార్టీలు గుర్తుంచుకోవాలని సూచించారు. దివంగత మాజీ జడ్పీ చైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతుతూ రాజకీయాల్లో స్థాయి తగ్గిపోతోందనే భావన పెరుగుతోందని, నేతలు తాము మాట్లాడే భాషను సమీక్షించుకోవాలని చెప్పారు. 27 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం పిన్నమనేని కోటేశ్వరరావు పని చేశారని తెలిపారు. అంతకాలం జడ్పీ చైర్మన్గా పనిచేయడం సాధారణ విషయం కాదన్నారు. ఆదర్శ ప్రజానాయకుడికి ఉండాల్సి అన్ని లక్షణాలు పరిపూర్ణంగా కలిగిన వ్యక్తి పిన్నమనేని అని కొనియాడారు.
పార్టీ మారకుండా పార్టీలకు అతీతంగా పని చేశారని, దీన్ని నేటితరం నేతలు నేర్చుకోవాలని సూచించారు. రాత్రి పడుకునే ముందు ఈ రోజుం చేం చేశామనే దాన్ని ప్రతి నాయకుడూ సమీక్షించుకోవాలన్నారు. కుల, మత, వర్గాల పేరుతో జాతిని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని, ఇది మంచిది కాదని తెలిపారు. వారసత్వంతో కాదు జవసత్యాలతో రాజకీయాలోకి రావాలని సూచించారు. కులం కన్న గుణం మిన్న అనేది అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు.













