వైకాపాలో చేరిన సినీ నటుడు అలీ
సినీ నటుడు అలీ వైకాపాలో చేరారు. లోటస్పాండ్లో జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు ండువా కప్పి జగన్ తన పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు తూర్పు నుంచి టీడీపీ తరపున అలీ పోలీచేస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే, టీడీపీ నుంచి సృష్టమైన హామీ రాకపోవడంతో తాను పార్టీ మారుతున్నట్లు అలీ మీడియాకు వెల్లడించారు. జగన్ మాట ఇస్తే తప్పరన్నారు. వైకాపా గెలుపుకోసం కృషి చేయాలని జగన్ కోరారని చెప్పారు. రాజమండ్రి లేదా విజయవాడ నుంచి టికెట్ ఇస్తే పోటీ చేస్తానని తెలిపారు. జనసేనలో ఎందుకు చేరలేదన్న ప్రశ్నకు రాజకీయాలు వేరు.. ఫ్రెండ్షిప్ వేరు అని సమాధానమనిచ్చారు.













