ఏపీలో సచివాలయ ఉద్యోగులకు.. ఆనందయ్య మందు

ఆంధప్రదేశ్ సచివాలయంలో ఉద్యోగులకు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆనందయ్య మందు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి సహకారంతో ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సచివాలయంలో 2 వేల మందికి పంపిణీ చేస్తామని తెలిపారు. చంద్రగిరి నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆనందయ్య మందును ఉద్యోగులకు పంపిణీ చేశారు. ఆనందయ్య మందు ఇమ్యూనిటీ బుస్టర్ లాగా పని చేస్తోందని వెల్లడించారు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు సైతం అందిస్తామన్నారు. కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులను కోల్పోయామన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగుల భవిష్యత్ దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు.