వెంకయ్య నాయుడు ఎంపికపై ఏపీ మంత్రులు హర్షం
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడి ఎంపిక పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, పలువురు రాష్ట్ర మంత్రులు హర్షం ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రులు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మంత్రులు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, శిద్ధా రాఘవరావు, నారా లోకేష్, కామినేని శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, అమర్నాథరెడ్డి, నక్కా ఆనందబాబు, అచ్చెన్నాయుడు, నారాయణ, ఎంపీ కేశినేని నాని తదితరులు హర్షం వ్యక్తం చేశారు. అయితే దక్షిణాదికే పెద్ద దిక్కయినా వెంకయ్యనాయుడు మరికొంతకాలం పాటు క్రియాశీల రాజకీయాల్లో కొనసాగితే బాగుంటుందని, లేకుంటే రాష్ట్రానికి కొంత నష్టం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు గంటా శ్రీనివాస్‌రావు, ప్రతిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు.













