అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి శ్రీకారం
రాజధాని అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి యాజమాన్యం శ్రీకారం చుట్టింది. యూనివర్సిటీని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కాగా, ఏడు ఎకరాల్లో 3లక్షల చదరపు అడుగుల్లో యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణం జరగనుంది. ఆగస్టు 7 నుంచి క్లాసులు ప్రారంభం కానుండగా 200 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభవుతున్నాయి. అలాగే యూనివర్సిటీకి ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు. రికార్డు సమయంలో పూర్తిచేసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు, మంత్రులు గంటాశ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.













