వైసీపీకి షాక్… వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుడ్ బై
రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడిరచారు. నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఆయనను ఖరారు చేసిన తర్వాత నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి కోరారు. అందుకు ముఖ్యమంత్రి జగన్ అంగీకరించలేదు. నెల్లూరు నగరం నుంచి అనిల్ కుమార్ యాదవ్‌ను తప్పించినా, మళ్లీ ఆయన అనుచరుడు ఎండీ ఖలీల్‌కు టికెట్ఖరారు చేశారు. దీంతో పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరులోని తన నివాసానికి చేరుకున్నారు. నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్, అనుచులతో కలిసి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా పత్రాలను విడుదల చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్ననని, తక్షణం తన రాజీనామాను ఆమోదించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇప్పటివరకు తనకు సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.













