ఆనాడు వైఎస్ఆర్.. నేడు జగన్ మాత్రమే : వెల్లంపల్లి
పేదల గురించి ఆలోచించింది ఆనాడు వైఎస్ఆర్, నేడు వైఎస్ జగన్ మాత్రమే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజాసంకల్ప పాదయాత్ర నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారని తెలిపారు. ఎండ, వాన లెక్క చేయకుండా 14 నెలల పాటు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో అనేక ఘటనలు వైఎస్ జగన్‌కు ఎదురయ్యాయి. మ్యానిఫెస్టోని రెండేళ్లలో నేరవేర్చారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత గొప్పగా పరిపాలన చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి జగన్. ప్రజలకి మంచి చేయాలన్న మనసున వ్యక్తి. ఇచ్చినమాటను నిలబెట్టుకుంటున్న వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.













