రసవత్తరంగా మారుతున్న విశాఖ తూర్పు పోటీలు.. వెలగపూడి వర్సెస్ ఎంవీవీ..
విశాఖలో ఉన్న సీట్లలో కచ్చితంగా టిడిపి ఖాతాలో పడే సీటు ఏది అంటే కళ్ళు మూసుకొని ఎవరైనా విశాఖ తూర్పు అని కన్ఫామ్ గా చెప్పేస్తారు. టిడిపికి ఆ ప్రాంతంలో అంత స్ట్రాంగ్ హోల్డ్ ఉంది మరి. 2009లో పుట్టిన ఈ తూర్పు సీటు లో మరో పార్టీ నెగ్గింది లేదు. అప్పటినుంచి ఇక్కడ తెలుగుదేశం జెండా రెపరెపలే తప్ప మరొక పార్టీ నీడ కూడా పడింది లేదు. వరుసగా మూడుసార్లు ఇక్కడి నుంచి టిడిపిని గెలిపించిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. ఈ నేపథ్యంలో నాలుగవసారి రాబోయే ఎన్నికల కోసం కూడా ఆయన రెడీ అవుతున్నాడు.
అయితే ఈసారి ఎలాగైనా టిడిపి కోటలో జెండా పాత దానికి ఫిక్స్ అయిన వైసిపి వెలగపూడి కి పోటీగా ఎంవీవీ సత్యనారాయణ ను దింపుతోంది. అధవలం అంగబలం బాగానే ఉన్నప్పటికీ వెలగపూడి కంటే కూడా ఎంవీవీ కాస్త స్ట్రాంగ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వం మద్యం పాలసీలను మార్చిన తర్వాత వెలగపూడి ఆర్థికంగా కాస్త తగ్గాడు అన్న టాక్ వినిపిస్తోంది. బేసిక్ గా మద్యం వ్యాపారం చేసే వెలగపూడి కి ప్రభుత్వం మార్చిన మద్యం పాలసీల వల్ల పెద్ద దెబ్బ తగిలింది. తమ ఐదేళ్ల పాలనలో వైసిపి తూర్పుని ఫుల్లుగా ఫోకస్ చేసి ..ఎత్తుకు పైవేత్తు వేస్తూ వస్తోంది.
దీనికి నిదర్శనం లోకల్ బాడీ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో వైసిపి కార్పొరేట్ లు నెక్కడం. మరోపక్క వెలగపూడి దొంగ ఓట్లు పెద్దగా చేర్చారు అంటూ గత ఎడాది నుంచి వరుసగా ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. కేవలం వెలగపూడి నియోజకవర్గం లోని 40 వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని వైసిపి తిరిగి అతనిపై ఆరోపణ చేసింది. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే తప్ప దొంగ ఓట్ల విషయంలో ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఎటువంటి క్లారిటీ రాలేదు. లెక్కల ప్రకారం మొత్తం తూర్పులో 2 లక్షల 80 వేల మంది ఓటర్లు ఉన్నారు.ఎంవీవీ పాదయాత్రల పేరుట ప్రజలతో మమేకమై ముందుకు పోతున్నారు. ఎన్నికల కోడ్ లేకపోవడం వల్ల ఆయన ఏమి చేసినా ఎవరు అడగలేని పరిస్థితి నెలకొంది.
ఇటు టిడిపి బలంగా ఉన్నచోట కూడా క్యాడర్ ని పిలిపించి మరీ తమ పార్టీలోకి లాగేసుకుంటున్నారు. ఇక వెలగపూడి తనకు లైఫ్ త్రెట్ ఉంది అంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చాడు. ఎన్నడూ లేనిది రెండు సార్లు తనకు పోటీగా నిలబడిన ప్రత్యర్థి ఎమ్మెల్యే వంశీ ఇంటికి వెళ్లి మరి మద్దతు కోరాడు వెలగపూడి. ఇది ఎన్నికల వ్యూహం అనేవారు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం ఎక్కడో టిడిపి శ్రేణులలో కాస్త కలవరం కనిపిస్తోంది అంటున్నారు. మూడుసార్లు కచ్చితంగా గెలిచిన హిస్టరీ వెలగపూడిది.. రాజకీయ అదృష్టవంతుడిగా పేరు పొందిన వ్యక్తి ఎంవీవీ. మరి ఈ ఇద్దరూ పోటీ పడుతున్న ఈ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదో చూడాలి.













