Vice Chancellor : ఏపీలోని వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకం
ఆంధ్రప్రదేశ్‌లోని పలు వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల (Vice Chancellor )ను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Abdul Nazir) నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రా వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జి.పి.రాజశేఖర్ (G.P. Rajasekhar ) నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గణితశాస్త్ర ఆచార్యునిగా చేస్తున్నారు. కాకినాడ జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ (C.S.R.K. Prasad)ను నియమించారు. ప్రస్తుతం ప్రసాద్ వరంగల్ నిట్‌లో సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. యోగి వేమన వర్సిటీకి వీసీగా ప్రొఫెసర్‌గా పి.ప్రకాశ్‌బాబు నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన హెచ్‌సీయూ, స్కూల్ ఆఫ్ లైఫ్సైన్సెస్లో బయో టెక్నాలజీలో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వీరంతా మూడేళ్లపాటు ఆయా వర్సిటీలకు వీసీగా కొనసాగనున్నారు.
వర్సిటీలు- నూతన వీసీలు
రాయలసీమ వర్సిటీ – వెంకట బసవరావు
అనంతపురం జేఎన్టీయూ – హెచ్. సుదర్శనరావు
తిరుమల పద్మావతి మహిళా వర్సిటీ – ఉమ
మచిలీపట్నం కృష్ణా వర్సిటీ – కె.రాంజీ
ఆదికవి నన్నయ వర్సిటీ – ప్రసన్న
శ్రీ విక్రమ సింహపురి వర్సిటీ -అల్లం శ్రీనివాసరావు నియమితులయ్యారు.













