వేడుకగా వసంతోత్సవాలు ప్రారంభం
తిరుమల వసంత మండపంలో శాస్త్రోక్తంగా వసంతోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. వసంత రుతువులో శ్రీమలయప్పస్వామి వారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవమని పేరు. ఎండ వేడినుంచి ఉపశమనం పొందేందుకు శ్రీదేవిభూదేవి సమేత శ్రీమలయప్పస్వామికి సుగంధాన్ని వెదలజ్లే పుష్పాలతో పలురకాల మధురఫలాలను నివేదించారు. ఈ వేడుకల కోసం పట్టివేర్లతో మండపాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. వసంతోత్సవాల ఆరంభం శుభసూచకంగా ఉదయం 7 గంటలకు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్ప స్వామి నాలుగుమాఢవీధుల్లో ఊరేగింపుగా వసంతమండపానికి చేరుకున్నారు. ఉదయం ఆస్థానం చేపట్టారు.













