ఇంద్రకీలాద్రిపై వరుణ యాగం
వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి వెంటనే వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ కనకదుర్గమ్మ సన్నిధిలో దేవస్థానం అధికారులు వరుణయాగాన్ని తలపెట్టారు. ఉదయం ఆరు గంటలకు కృష్ణానది ఒడ్డున దుర్గాఘాట్‌లో రాష్ట్ర దేవాదాయ ధర్మదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, దుర్గగుడి కార్యనిర్వహణాధికారి వి.కోటేశ్వరమ్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వరుణ యాగాన్ని ప్రారంభించారు. అనంతరం దేవస్థానం వేదపండితులు, అర్చకస్వాములు, వేద విద్యార్థులు వరుణ జపం, వారుణానుపాక పారాయణాలు, శతానువాక పారాయణలు, విరాట్ పర్వ పారాయణం నిర్వహించారు. ఈ నెల 24వ తేదీ వరకు వరుణ యాగం నిర్వహించనున్నారు.













