Pithapuram: పిఠాపురంలో పవన్ కు పోటీగా వర్మ.. వైసీపీ కొత్త వ్యూహం..

పిఠాపురం (Pithapuram) నియోజకవర్గంలో రాజకీయంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ జనసేన (JanaSena) పార్టీకి సంబంధించి స్పష్టమైన ఆధిపత్యం కనిపిస్తుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మాత్రం నిలదొక్కుకోలేని స్థితిలో ఉంది. పిఠాపురం నుంచి గతంలో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన పెండెం దొరబాబు (Pendem Dorababu) జనసేనలోకి చేరడం, ఆ పార్టీకి ఎంతటి బలాన్ని ఇచ్చిందో చెప్పక్కర్లేదు. ఆయన అనుచరులంతా జనసేన వైపే మొగ్గుచూపుతున్నారు.
ఇక గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత (Vanga Geetha) ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు .ఇటీవల వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఇచ్చిన “బాబు మేనిఫెస్టో”పై ప్రచారం చేయాలన్న ఆదేశాలకు ఆమె తగిన స్పందన ఇవ్వలేకపోయారు. మొదట్లో రెండు రోజులు కొంత ప్రయత్నించినప్పటికీ, ఆమె నిర్వహించిన సమావేశానికి ఎవరు పెద్దగా హాజరు కాకపోవడం, వంద మందికి లోపే రావడం వంటివి ఆమె చుట్టూ ఉన్న పరిస్థితిని బహిర్గతం చేశాయి. దీంతో ఆమెకు ప్రజలలో పెద్దగా మద్దతు లేదు అన్న విషయం స్పష్టం అవుతుంది.
ఇక గీత స్పందించాల్సిన కొన్ని ముఖ్యమైన సంఘటనలపై కూడా నిశ్శబ్దంగా ఉండడం, పార్టీ వర్గాల్లో అసహనం పెంచిందని అంటున్నారు. ఈ స్థితి వెనక ఆమెకు నెక్స్ట్ ఎలక్షన్స్ కు టికెట్ రాదన్న భయం కూడా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పిఠాపురంలోని టీడీపీ నాయకుడు వర్మ (Varma) అసంతృప్తిగా ఉండటం, వైసీపీ ఆయన పై కాస్త హోప్స్ తో ఉన్నట్లు టాక్, ఆయనకు మీడియా ద్వారా ప్రాధాన్యం కల్పించడం చూస్తే, గీత స్థానంలో ఆయన టికెట్ దక్కించుకునే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో వంగా గీత తిరిగి ప్రజల మధ్యకి వచ్చి జనసేనపై విమర్శలు చేయడం ద్వారా రాజకీయంగా ఉపయోగం ఏమీ ఉండదని భావిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో చూస్తే, వచ్చే ఎన్నికలకు పవన్ క్రేజ్ ను ఎదురుకోవడానికి వైసీపీ కొత్త వ్యూహం తయారు చేస్తోంది. అని అర్థమవుతుంది. అయితే ఇది ఎంతవరకు కలుస్తుంది అన్న విషయం చూడాలి..