ఇది నిజం కాదని జగన్ నిరూపించగలరా? : వర్ల రామయ్య
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు జరిగిన రోజు సీఐడీ చీఫ్ సంజయ్, డీఐజీ రఘురామిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలతో లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది నిజం కాదని జగన్ నిరూపించగలరా? అని సవాల్ చేశారు. చంద్రబాబు అరెస్టు గురించి తనకు తెలియదని బహిరంగసభల్లో జగన్ చెప్పడం పచ్చి అబద్ధమన్నారు.













