వంగవీటి పై బాబు ఆశ ఫలిస్తుందా.. గెలుపు దక్కుతుందా..
ఆంధ్రాలో రాజకీయాలు (AP Politics )రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే పట్టభద్రుల ఎన్నికపై (Graduate Elections )ఇటు టీడీపీ కూటమి (TDP alliance) కసరత్తు చేస్తుంటే అటు వైసీపీ కూడా ఎత్తుకు పై ఎత్తు వేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే 11 సీట్లకు పరిమితమైన జగన్( Jagan ) ఒకరకంగా ఆంధ్రాలో మొత్తం పోగొట్టుకున్నారు.. నిండా మునిగిన వాడికి చలేంటి అన్నట్టుగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారు. మరో పక్క చంద్రబాబు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.
దీంతో విజయవాడ గుంటూరు పట్టభద్రుల (Guntur MLC) ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా రంజుగా ఉండేలా కనిపిస్తున్నాయి. ఇరు పార్టీల నుంచి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. జగన్ తరఫునుంచి ఆయన సన్నిహిత బంధువు అయినా గౌతంరెడ్డి (Gautam Reddy) పోటీకి దిగే అవకాశం ఉందని గట్టి టాక్. ప్రస్తుతం ఓటర్లలో పెరిగిన అసంతృప్తి తమ పార్టీకి ప్లస్ అవుతుందని వైసీపీ భావిస్తోంది.
టీడీపీ నుంచి ఇప్పటివరకు మాజీమంత్రి అలపాటి రాజా (Alapati Raja) పేరు వినిపించినప్పటికీ ఇప్పుడు వేరే పేరు హల్చల్ ఆ వ్యక్తి మరెవరో కాదు వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha Krishna) . ఒకప్పుడు వంగవీటి వైసీపీ లో ఉన్నప్పుడు ఆయనకు గౌతమ్ రెడ్డికి మధ్య వివాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వివాదం కారణంగానే వంగవీటి వైసీపీ (YCP) ను వదలాల్సి వచ్చింది. అందుకే గౌతమ్ రెడ్డికి వంగవీటి రాధా అయితే కరెక్టుగా సెట్ అవుతాడు అని చంద్రబాబు భావిస్తున్నారట.
మరోపక్క వంగవీటి రాధాకు ఈ సీటు ఇవ్వడం వల్ల జనసేన నుంచి కూడా టీడీపీకి ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఘనమైన రాజకీయ చరిత్ర కలిగిన వంగవీటి రంగా వారసుడు వంగవీటి రాధాకు రాజకీయంలో గెలుపు మాత్రం అంత సులువు కాదు. 2004 తర్వాత 2009 ప్రజారాజ్యం నుంచి, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి రాధా ఓటమి పాలయ్యారు. ఉమ్మడి కృష్ణ జిల్లాలో సామాజిక సమీకరణల దృశ్య రాధాకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. అయితే అది జరగాలంటే రాధ కచ్చితంగా ఎమ్మెల్సీగా నిలబడి..కలబడి..గెలవాలి. ఎలాగైనా తమ పంతం లెక్కించుకోవాలి అని టీడీపీ.. ఈసారి గెలిచి కనీసం ఉన్న కాస్త పరువును దక్కించుకోవాలని వైసీపీ.. ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలను టఫ్ ఫైట్ గా మార్చబోతున్నాయి.













