వంగవీటి రాధా సంచలన ఆరోపణలు …
నిత్యం ప్రజల మధ్య ఉంటున్న తనను హత్య చేసేందుకు కొందరు రెక్కీ నిర్వహించారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సంచలన ఆలోపణలు చేశారు. రాష్ట్ర మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమక్షంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తాను భయపడబోనని, ప్రజల మధ్య నుంచి తప్పుకోనని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడ్ల వల్లేరు మండలం చినగొన్నురు గ్రామంలో దివంగత వంగవటీ మోహనరంగా విగ్రహావిష్కరణ సభలో ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారికతో కలిసి పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం వంగవీటి రాధా మాట్లాడుతూ తాను ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటానని, ప్రజల నుంచి తనను ఎవరూ దూరం చేయలేరని, తనను అంతం చేయాలనుకుంటున్న వారిని దూరం పెట్టాలని ప్రజలను రాధా కోరారు. తన తండ్రి వంగవీటి రంగా ఆశయ సాధనకు పనిచేస్తున్నానని పదవులుపై ఎలాంటి ఆశలు లేవని స్పష్టం చేశారు.













