జనసేనలోకి వంగవీటి రాధా?
మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరే సూచనలు సృష్టంగా కన్పిస్తున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌తో వంగవీటి సమావేశమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని రాధాకృష్ణ అధికారికంగా వెల్లడించక పోయినప్పటికీ జనసేన నేతలు ధృవీకరిస్తున్నారు. సరిగా ఎన్నికల సమయంలో రాధాకృష్ణ తెలుగుదేశంలో చేరి పలు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. 2004 ఎన్నికల్లో రాజకీయాల్లో ప్రవేశించడం, వైఎస్ ఆశీస్సులతో విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. తరువాత 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం తర్వాత కొంత కాలం కాంగ్రెస్‌లో గడిపినప్పటికీ మళ్లీ ఇమడలేక వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ కూడా ఎక్కువకాలం కొనసాగలేక గత ఎన్నికల సమయంలో తెలుగుదేశంలో చేరారు.













