తెలుగుదేశంలోకి వంగవీటి రాధా
తెలుగుదేశం పార్టీలోకి వంగవీటి రాధాకృష్ణ చేరికకు ముహూర్తం ఖారారైంది. రేపు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే ఎన్నికల్లో పోటీపై నిర్ణయాన్ని మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబుకే రాధా వదిలేశారు. దాదాపు గంటన్నర పాటు చంద్రబాబుతో చర్చలు జరిపిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. చంద్రబాబుతో భేటీలో వైసీపీలో తనకు జరిగిన అవమానాలను కూడా రాధా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తనకు ఎన్నికల్లో పోటీ చేయటం ప్రధాన ఉద్దేశం కాదని, వైసీపీని ఓడించడమే ప్రధాన లక్ష్యమని రాధా పేర్కొంటున్నారు. రేపు సాయంత్రం లోగా టీడీపీలో చేరేందుకు రాధా అంగీకారం తెలిపారు. వంగవీటి రాధకు మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వంగవీటికి టికెట్ ఇస్తే మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణను పెడన శాసనసభ స్థానం నుంచి బరిలోకి దించే అవకాశం ఉంది.













