టీడీపీలో చేరిన వంగవీటి రాధా
విజయవాడ నగరంతో పాటు పలు జిల్లాల్లో పేరు ప్రఖ్యాతలు గాంచిన కాపు సామాజిక వర్గనేత స్వర్గీయ వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాధాకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో రాధా చేరిక కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లా చీరాల చెందిన వైకాపా నేత యడం బాలాజీ కూడా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ తాను పేదలకోసం పనిచేస్తున్నానని పేదలందరికి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తాను ప్రజల మనిషిని తాను ప్రజల కష్టాలు తీర్చేందుకే టీడీపీలో చేరానని ప్రకటించారు. టీడీపీ తన ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చేపడుతుందని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో తన ప్రయత్నం నేరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. రాధా చేరిక సందర్భంగా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు.













