Vangalapudi Anitha: మాకు రిజర్వేషన్లు వద్దు, అనిత సంచలన కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే(Womens day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం లో ప్యానెల్ డిస్కషన్ జరగగా.. ముఖ్య అతిధులుగా ముగ్గురు మహిళా మంత్రులు హాజరు అయ్యారు. వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవితా తో పాటుగా పాలిస్ శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా అనిత సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రతి ఒక్క మహిళకి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పారు. మహిళను విమర్శించటంలో ముందు క్యారెక్టర్ ను దుషిస్తారన్నారు.
కూలీ చేసుకునే వారి నుంచి పెద్ద ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరూ గొప్పగానే చెప్పాలన్నారు. నేను ఇక్కడ కూర్చోవడానికి అవకాశం కల్పించిన మా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాను అన్నారు. తనకు తన తండ్రి స్ఫూర్తి అని.. తర్వాత తాను చనిపోయే వరకు తనకు ప్రత్యక్ష దైవం చంద్రబాబు(Chandrababu Naidu) గారు అంటూ కొనియాడారు. అనేక అవమానాలు, ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చామన్నారు. మాకు రిజర్వేషన్లు అక్కర్లేదని.. తాము మేము అనుకుంటే ఎక్కడి వరకు అయిన వెళ్తామన్నారు.
తాను ఎక్కడికి వెళ్ళినా… మగపిల్లలా ముందుకు వెళ్తున్నాను అంటారు అని.. ఈ భేదం మనకి తల్లి దగ్గరి నుంచీ వస్తుంది అన్నారు. మగ వారిని, ఆడవారిని కొంచం లింగ భేదంగా పెంచుతుంటారన్నారు. ఎప్పుడు అయితే తల్లి నువ్వు మగ పిల్లల వాడివి జాగ్రత్త అని చెప్పే రోజు రావాలన్నారు. ఇక మరో మంత్రి సవిత మాట్లాడుతూ.. మాది మొదటి నుంచి రాజకీయ కుటుంబం, ఎన్టీఆర్ గారిని చూస్తూ పెరిగానన్నారు. రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నారు. అనేక కేసులు , అవమానాలు పడుతూ ముందుకు ఈ స్థాయికి వచ్చానన్నారు.













