ఇలాంటి రాజకీయాలు ఆయనకు అలవాటే : వంగలపూడి అనిత
తెనాలికి చెందిన గీతాంజలిని హత్య చేసింది వైసీపీనే అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆడబిడ్డ చావుపైనా జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలు ఆయనకు అలవాటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ బాబాయ్ హత్య, కోడి కత్తి డ్రామాలు రక్తి కట్టించారన్నారు. గీతాంజలి మృతి సమయంలో ఆమె వెంట ఉన్న ఇద్దరి పేర్లు ఎందుకు బయట పెట్టడం లేదని అనిత నిలదీశారు. గుర్తు తెలియని మృతదేహంగా రెండు రోజులు ఆసుపత్రిలోనే ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. టీడీపీ సోషల్ మీడియా ప్రచారం వల్లే చనిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆమె భర్తతో వైసీపీ వాళ్లే ఫిర్యాదు ఇప్పించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఆడబిడ్డలే జగన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడిస్తారన్నారు.













