ఆ విషయం మరిచిపోయి.. వైసీపీలో గుర్తింపు కోసం
వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ బిక్షతో మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారన్నారు. ఆ విషయం మరిచిపోయి వైసీపీలో గుర్తింపు కోసం టీడీపీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసన్నకుమార్ రెడ్డి చరిత్ర మొత్తం తన దగ్గర ఉందన్నారు. ఆయనకు హైదరాబాద్లో ఉన్న ఇల్లు ఎవరికి రాసిచ్చారో దమ్ముంటే చెప్పాలన్నారు. తన క్యారెక్టర్ గురించి మాట్లాడితే ప్రసన్న చరిత్ర మొత్తం మీడియా ముందు ఉంచుతానన్నారు. ఎమ్మెల్యే మాటలకు, బెదిరింపుకు అనిత భయపడదన్నారు. తన గురించి అబద్ధపు ప్రచారం చేయడం ఆపకపోతే ప్రసన్న ఇంటికి వెళ్లి తాట తీస్తానన్నారు. ఎమ్మెల్యే రోజా నగరిలో పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోగలరా? అని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎం అవ్వగానే వైసీపీ నేతల ఇళ్ళకు వెళ్లి బడిత పూజ చేస్తామన్నారు.













