రాష్ట్రంలో ఉంది మహిళా కమీషనా? లేక జగన్ రెడ్డి కమీషనా ?
సీఎం జగన్ అసమర్థ చర్యల వల్ల ఖజానా ఖాళీ అయిందని తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కుప్పంలో ఓటుకు రూ.5 వేలు ఇచ్చామని వైసీపీ నేతలు అంటుంటే, ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. పులివెందులకు నీరిచ్చిన ఘనత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుదేనని అన్నారు. ఈసారి జగన్ రెడ్డి పులివెందుల్లో గెలవడం కష్టమన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన మహిళలను అడ్డుకోవడం సరికాదన్నారు. నేడు జగనన్నకు చెబుతామంటూ కార్యక్రమం పెట్టడం సిగ్గుచేటని, రాష్ట్రంలో ఉంది మహిళా కమీషనా? లేక జగన్ రెడ్డి కమీషనా? అని ప్రశ్నించారు.













