Home Minister Anita: అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం : హోంమంత్రి అనిత
వైసీపీ అధినేత జగన్ మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత (Home Minister Anita) విమర్శించారు. జగన్ (Jagan) దగ్గరే ప్రసన్నకుమార్ రెడ్డి (Prasanna Kumar Reddy) నేర్చుకున్నారు. ఆయన తీరును ఒక్క జగన్ తప్ప ఎవరూ సమర్థించడం లేదు. రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లి గురించే తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్‌ది. రౌడీషీటర్లను, బెట్టింగ్ యాప్ (Betting app) లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు. జగన్ పర్యటనలో ఒకసారి తలకాయ, మరోసారి మామిడికాయలు (Mangoes) తొక్కించారు. ప్రజలు కూడా ఆలోచించాలి. రప్పా రప్పా నరకుతామనడం తప్పు కాదంటారా? 50 వేల మెజారిటీతో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గెలిచారు. మహిళ నేతపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను న్యాయస్థానాలు కూడా తప్పుపట్టాయి. అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు.













