అమరావతి బ్రాండ్ అంబాసిడర్ కు పెద్ద మనసు
ఆ చిన్నారి పేరు వైష్టవి. వయసు 14 సంవత్సరాలు. ఊరు కృష్ణా జిల్లా ముదినేపల్లి. ఆమె తండ్రి అంబుల మనోజ్ ఓ ప్రైవేటు వైద్యుడు. వైష్టవికి సొంత రాష్ట్రమంటే ఎంతో అభిమానం. ఇది గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమెను గతంలో అమరావతికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. గతంలో వైష్టవి కడప ఉక్కు ఫ్యాక్టరీకి రూ.లక్ష, అమరావతి స్థూపానికి రూ.లక్ష, రాజధాని నిర్మాణానికి రూ.లక్ష విరాళంగా ఇచ్చింది. మరోసారి తన ఉదారత చాటుకుంది. పామర్రు మండలం కొమరవోలులో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్న కార్యక్రమ వేదికపై వైష్టవి కూడా మాట్లాడింది. చంద్రబాబు తిరిగి సీఎం కావాలి. ఆయన మళ్లీ ప్రమాణం చేసే రోజునే ముదినేపల్లి మండలంలో మాకున్న 3 ఎకరాల్లో 25 లక్షల విలువ చేసే ఎకరా భూమిని పోలవరం ప్రాజెక్టుకి విరాళంగా రాసిస్తాను. అదేరోజున తిరుమల కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకుంటాను అని వైష్టవి తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.లక్ష, హైకోర్టు భవనాల నిర్మాణానికి రూ.లక్ష విరాళంగా ప్రటించింది. తన చేతి వేలికి ఉన్న బంగారపు ఉంగారాన్ని ముఖ్యమంత్రికి అందించింది.













