ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించిన యూఎస్ కాన్సులేట్

ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి యూఎస్ కాన్సులేట్ అభినందనలు తెలియజేసింది. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఓకే రోజుల్లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడంపై యూఎస్ కాన్సులేట్ ప్రశంసల వర్షం కురిపించింది. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పనిచేసిన వైద్య సిబ్బందిని అభినందించింది యూఎస్ కాన్సులేట్. ఒకేరోజు 1.3 మిలియన్ ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వటం మాములు విషయం కాదు అంటూ కొనియాడింది. మీరు చేస్తున్న కృషి ప్రజల ప్రాణాలను కాపాడుతుంది అంటూ పేర్కొంది. ట్విటర్ వేదికగా యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రైఫ్ మన్ పేరుతో ట్విట్‍లో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కృషిని ప్రశంసించడంతో పాటుగా, ఏపీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కు కితాబిచ్చారు.