సీఎం వైఎస్ జగన్‌తో కేథరిన్ హడ్డా భేటీ
అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. అమరావతి సచివాలయానికి వచ్చిన కేథరిన్ ఆయనతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరిద్దరూ సమావేశం కావటం ఇదే తొలిసారి. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులు, ఉద్యోగార్థులకు సంబంధించిన వీసాలు ఇతర అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. యూఎస్‌కు సంబంధించిన వివిధ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపైనా ముఖ్యమంత్రి కాన్సులేట్ జనరల్‌తో చర్చించినట్లు సమాచారం.













