సోము వీర్రాజుతో యూఎస్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృంధం భేటీ
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో యూఎస్ కాన్సులేట్ జనరల్ చీఫ్ పొలిటికల్ డైరెక్టర్ సీన్ రూతే బృందం సమావేశమైంది. కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ తరుపున విజయవాడలోని ఓ హోటల్లో సమావేశమై వీరు వివిధ అంశాలపై సోము వీర్రాజుతో చర్చించారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో సమకాలీన అంశాలపై వీరి కొద్ది నిమిషాల పాటు చర్చించుకున్నారు. దేశంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా యూఎస్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందాన్ని ఎస్.విష్ణువర్థన్ రెడ్డి, రాష్ట్ర మీడియా ఇన్చార్జి కేవీ లక్ష్మీపతి రాజా తదితరులు ఉన్నారు.













